Wife & husband jokes
*కాసేపు నవ్వుకోండెహే..😊*
భార్య:
నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.
భర్త:
నాది నీకంటే ఇంకా గొప్పతనం...! నిన్ను చూసినతర్వాత కూడా పెళ్లి చేసుకున్నాను !!
😄😁😄😃
భార్య :
ఏమిటి ఫోన్ లో ఎవరితో చాలా లోగొంతుకతో మాట్లాడుతున్నారు ?
భర్త :
చెల్లెలితో మాట్లాడుతున్నా.
భార్య :
చెల్లెలితో అయితే మెల్లగా ఎందుకు మాట్లాడటం ?
భర్త : నేను మాట్లాడేది *నీ చెల్లెలితో*.
😁😆😁😆😁
భార్య :
ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా. మీతలమీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదేఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా.
భర్త :
జుట్టు రాలిపోతోందని ఇన్నాళ్లూ అనవసరంగా బాధపడ్డాను. ఈసంగతి ముందే తెలిసుంటే జుట్టు రాలిపోవటం గురించి అసలు పట్టించుకుని ఉండేవాణ్ణికాదు.
😁😄😁😄😁
భార్య :
ప్రపంచం మొత్తంలో ఎంతవెతికినా నాలాంటిభార్య మీకు దొరకనేదొరకదు.
భర్త :
పిచ్చిదానా... ఒకవేళ నేను వెతకవలసివస్తే మళ్ళీకోరికోరి నీలాంటిదానికోసమే ఎందుకు వెతుకుతాను ? మరీ టూమచ్ గా మాట్లాడకు.
🙂😄😋🙂😁
టాక్సీ డ్రైవర్ :
సార్..... బ్రేకులుపని చేయటంలేదు. ఏం చేయమంటారు ?
పాసింజర్ :
ముందు మీటర్ ఆపేయ్ రా... దరిద్రుడా !
😄😁😆😁😄
భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.
షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?
కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని *పెళ్ళాం కాక* కన్నతల్లి పంపిస్తుందా ?
😁😆😆😆😁
*ప్రతిభకూ, దేవుడు ప్రసాదించిన వరానికీ మధ్య వ్యత్యాసం* :-
ఎవడైనా ఒకవిషయంమీద అనర్గళంగా మాట్లాడగలిగితే దాన్ని...
*ప్రతిభ* అంటారు.
కానీ...
అసలు విషయమేలేకుండా గుక్కతిప్పుకోకుండా ఏ ఆడదైనా మాట్లాడుతూంటే....
అది *దేవుడిచ్చిన వరం* అవుతుంది.
😁🙃😁🙃😁
టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...
*"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"*
గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..
*అబ్బే లేదు, బాంబు సీతాకోకచిలక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నా చెవి దగ్గర గుసగుసలాడుతూ అన్నాది.. తుస్ అని* !!!
⚡💥🔥😆😁😆
రామారావు ఆత్మహత్య చేసుకోవడానికని విషం కొనుక్కోటానికి మెడికల్ షాప్ కి వెళ్ళాడు.
షాపువాడు :
నువ్వు ప్రిస్క్రిప్షన్ తెచ్చావా ?
రామారావు తన జేబులో నుండి పెళ్లి సర్టిఫికేట్ బయటకుతీసి చూపించాడు.
షాపువాడు : అర్ధమయ్యింది బ్రదర్! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్ని బాటిల్స్ కావాలి ? ఒకటా..రెండా...?
😜😜😜😜😜😜😜😜😜😜😜
Green tea
😷
ఇంటికి వచ్చిన అతిథులకు గ్రీన్ టీ ఇవ్వటం వలన కలిగే లాభాలు:
1. మనం ఉన్న వారిలా కనిపిస్తాం.
2. పాల ఖర్చు ఉండదు.
3. టీ తో పాటు బిస్కట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
4. రెండో సారి అడగరు.
5.రెండో సారి బహుశా మనింటికి రాకపోవచ్చు కూడా.
😂😜😝🤣
Jokes - mixed
స్టూడెంట్ : భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!!
😀😝
సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
😁😁😁😁
బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.
😛😛😛😛
(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న
😄😄😄😄
ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."
😀😀😀😀
చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!
😀😀😀😄
(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"
నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని
పలకరించాడు వరహాల రావు.
😀😀😄😄
అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!
😀😀😄😄
దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..
😄😄😄😄
ఇక మన పెళ్ళి జరగదు
నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.
-
లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.
😄😄😄😄
భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.
భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.
😄😄😄😄
పంతులు : ఒరేయ్ బబ్లూ వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?
.
బబ్లూ : మీరు పాఠం చెప్పడం వాస్తవం అది మేము వింటున్నామనుకోవడం భ్రమ
😄😄😄😄
నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిఛస్తాడు వెధవ
ఫాలో అవుతున్నాడు. భయంగా ఉంది
భర్త: దాని కి అంత భయం ఎందుకు?
నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?
పెళ్ళాం: ఉంది
భర్త: ఈ సారి వాడు నీ వెంట పడితే
వాటర్ బాటిల్‌తో...
..
..
..
..
..
..
..
..
..
...
...
.....
....
....
.....
....
....
....
....
.
...
నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిఛస్తాడు వెధవ..
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
బట్టతలా కాదురా పట్టుదల..
స్టూడెంట్ : బట్టతల ఉంటే చాలా గొప్పవాళ్ళు ఆవ్‌తారంట నిజమేనా??
టీచర్ : చెవిటి వెధవా...బట్టతలా కాదురా పట్టుదల..
😜😜😜😜
అది ఆంటీ బయ టికి రా కాదు.. ‘యాంటీబయాటిక్’..
సేల్స్ గర్ల్: సార్, వీడు ‘ఆంటీ బయటికి రా’ అంటున్నాడు.
కస్టమర్: లేదు సార్, మందుల చీటీలో అలానే ఉంది.. అదే చెప్పా..
ఓనర్: ఒరేయ్..అది ఆంటీ బయ టికి రా కాదు.. ‘యాంటీబయాటిక్’..
Wife and Husband Jokes Telugu
స్టూడెంట్ : భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!!
😀😝
సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
😁😁😁😁
బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.
😛😛😛😛
(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న
😄😄😄😄
ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."
😀😀😀😀
చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!
😀😀😀😄
(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"
నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని
పలకరించాడు వరహాల రావు.
😀😀😄😄
అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!
😀😀😄😄
దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..
😄😄😄😄
ఇక మన పెళ్ళి జరగదు
నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.
-
లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.
😄😄😄😄
భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.
భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.
😄😄😄😄
పంతులు : ఒరేయ్ బబ్లూ వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?
.
బబ్లూ : మీరు పాఠం చెప్పడం వాస్తవం అది మేము వింటున్నామనుకోవడం భ్రమ
😄😄😄😄
బామ్మ ROCKSSSSS డ్రైవర్ బాబు SHOCKZZZZZ
డ్రైవర్: ఓకే పడుకోండి
ఆ ముసలావిడకు నమ్మకం లేక పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు కూడా చెప్పింది, అందరూ సరే అన్నారు
చాలా దూరం ప్రయాణం తరువాత ముసలావిడ నిద్ర లేచింది, విజయవాడ ఇంకా రాలేదా బాబు?
అయ్యో సారీ బామ్మగారు మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100కి.మీలు వచ్చేశాము.. ఆమె ఏడవడం మొదలుపెట్టింది, మర్యాదగా వెనక్కి తిప్పి విజయవాడ తీసుకెళ్లమని గోల చేసింది, ఆమెకు తోటి ప్రయాణికులు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు, డ్రైవర్ వెనక్కి తిప్పి విజయవాడ తీసుకొచచి ఆమెను దింపడానికి ట్రై చేశాడు.
డ్రైవర్.. బామ్మగారు విజయవాడ వచ్చేసింది దిగండి...
ఆమె తన బ్యాగు నుండి రెండు ట్యాబ్లెట్స్ తీసి ఇలా అన్నది
నాకు బీపీ ఉంది బిడ్డ.. విజయవాడ రాగానే ట్యాబ్లెట్స్ వేసుకోమని బస్సు ఎక్కేటప్పుడు మా అబ్బాయి చెప్పాడు...
నేను కూడా వైజాగ్ వెళ్లాలి, ఇప్పుడు పోనీయ్యి బాబు వైజాగ్....
బామ్మ ROCKSSSSS
డ్రైవర్ బాబు SHOCKZZZZZ
అంతులేని ఆత్మవిశ్వాసం - how you want to become??
ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,
" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.
నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ
వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.
చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.
గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.
వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),
మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.
తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,
ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -
అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.
అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,
వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.
నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,
" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.
కాఫీ డికాషన్ వచ్చింది........
అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.
అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,
" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.
కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.
చితికిపోయే గుడ్డు గట్టిపడింది.
గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,
నీటిరంగునే మార్చింది.. అవునా..!!
ఇప్పుడు చెప్పు..
వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?
మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )
గట్టిపడిపోతావా..?
పరిస్థితులను మారుస్తావా...?
ఇక్కడ నీదే ఎంపిక,
దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.
ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.
దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..
" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.
🌺🌸🌺🌸🌺🌸
మీ కుక్కని నాకు కొన్ని రోజులు ఇవ్వగలరా
ఎదురుగా రోడ్డు మీద దహన సంస్కారానికి వెళ్తున్న శవం దాని వెనుక వెళ్తున్న గుంపు కనిపించింది.. దానివెనుకే మరో శవంతో వెళ్తున్న గుంపు కూడా కన ిపించింది..
ఈ రెండింటి వెనుక ఒక పెద్ద మనిషి ఒక కుక్కని పట్టుకుని సింగిల్ గా నడుస్తున్నాడు..
ఆ పెద్ద మనిషి వెనుక క్యూలో 200మంది లైన్ గా ఒక పద్దతిలో ఫాలో అవుతూ నడుస్తున్నారు ఆ విచిత్ర దృశ్యం గంగాధర్ ని ఆశ్చర్యపరిచింది.. శవ దహనానికి వెల్లేవారు ఈ విధంగా లైన్ లో వెళ్ళటాన్ని ఎప్పుడూ చూడలేదే అని గంగాధర్ మనసులో అనుకొని కుతూహలం ఆపుకోలేక ఆ పెద్దమనిషి దగ్గరకెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు..... " సార్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఇలా లైన్లో శవ దహనానికి వెళ్ళే వాళ్ళనింతవరకూ నేనెక్కడా చూడలేదు. ఇంతకీ ఈ అంత్య క్రియలెవరికి సార్ ?" అని అడిగాడు..
పెద్ద మనిషి : " మెదటి శవం నా భార్యది. "
గంగాధర్ : " అయ్యో ఎలా జరిగింది ?"
పెద్ద మనిషి : ఈ కుక్క మా ఆవిడ పై అటాక్ చేసి చంపేసింది. "
గంగాధర్ : " అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.. మరి రెండవ శవం సార్ ?"
పెద్ద మనిషి : " అది మా అత్తగారిది. ఆమె మా అవిడని కాపాడటానికి ట్రై చేసింది. అప్పుడు రెచ్చిపొఇన కుక్క ఆమెని కూడా పొట్టన పెట్టుకుంది అంటూ విలపిస్తూ చెప్పాడా పెద్ద మనిషి "
అది విన్న గంగాధర్ కొద్దిగా ఆలోచించి.....
గంగాధర్ : మీ కుక్కని నాకు కొన్ని రోజులు ఇవ్వగలరా? ఎంత కావాలంటే అంత ఇస్తాను..
పెద్ద మనిషి : "వెళ్ళి ఆ 200మంది వెనుక క్యూలో నిల్చోండి.. "
Inspiration quotes - Telugu
తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను
భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.
●●●•••••●●●•••••●●●•••••●●●
తూటా కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు💬
●●●•••••●●●•••••●●●•••••●●●
📌మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹💖నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹🏃నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని...
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸 👬స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹🔸✊చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹💖కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు. 👬🏃
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸🕛ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. 🏇
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. 👼
అదే తేడా...
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸👊☝గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు. 💐💖
●●●•••••●●●•••••●●●•••••●●●
🔹👌నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను...
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.✌💪
●●●•••••●●●•••••●●●•••••●●●
🔸✊👍స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.
●●●•••••●●●•••••●●
online bank account password
Frnd-2: Sita-Ram-Lakshman-Hanuman-Ravan-Delhi-Kejrival
Frnd-1: Adenti ra... neku mari jagratta kakapothe antha pedda password ah???
Frnd-2: naku matram em sarada ra... 5 characters undali ani adigindi ra... anduke sita, ram, lakshman, hanuman, ravan ani petta...
Frnd-1: mari Delhi enti ra?
Frnd-2: Capital kuda kavalanta ra...
Frnd-1 : Mari Kejrival ekkada nunchi vachhadu ra???
Frnd-2: vaadini special character kinda petta ra !!
Frnd-1: nuvvu super ra
😄😆😂
వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం.....
కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా రష్‌గా ఉంది.
"ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి.
కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.
ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు.
“…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు.
"అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు.
ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ?"
"నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.
కోడలు వెంటనే "ఎంతో నీట్‌గా సర్దుకున్న నా షెల్ఫ్‌లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ వాచీ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?" అంది కోపంగా.
"పట్టుచీరలు చిందరవందర చేయటం, కంప్యూటర్‌లో ఫైలు డిలిట్ చేయటం ఒకటేనా?" అన్నాడు మరింత కోపంగా కొడుకు.
ముసలాయన నవ్వాడు. "నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు."
ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్దాయన అటే చూస్తూ "ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా. మీకేమైనా అర్థం అయిందా?" అని అడిగాడు.
అర్థం కానట్టు చూశారు ఇద్దరూ.
“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం, పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి, గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం. ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్దికాలం ‘ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి’ అని ఆలోచించాలి తప్ప, డెలీటయిపోయిన ఫైళ్ళ కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు."
" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....."


