మీ కుక్కని నాకు కొన్ని రోజులు ఇవ్వగలరా

గంగాధర్ ఒక హోటల్  లో టిఫిన్ చేసి బయటి కొచ్చాడు..... 
ఎదురుగా రోడ్డు మీద దహన సంస్కారానికి వెళ్తున్న శవం దాని వెనుక వెళ్తున్న గుంపు కనిపించింది.. దానివెనుకే మరో శవంతో వెళ్తున్న గుంపు కూడా కన ిపించింది..
ఈ రెండింటి వెనుక ఒక పెద్ద మనిషి ఒక కుక్కని పట్టుకుని సింగిల్ గా నడుస్తున్నాడు..
ఆ పెద్ద మనిషి వెనుక క్యూలో 200మంది లైన్ గా ఒక పద్దతిలో ఫాలో అవుతూ  నడుస్తున్నారు ఆ విచిత్ర దృశ్యం గంగాధర్ ని ఆశ్చర్యపరిచింది.. శవ దహనానికి వెల్లేవారు ఈ విధంగా లైన్ లో వెళ్ళటాన్ని ఎప్పుడూ చూడలేదే అని గంగాధర్ మనసులో అనుకొని కుతూహలం ఆపుకోలేక ఆ పెద్దమనిషి దగ్గరకెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు..... " సార్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఇలా లైన్లో శవ దహనానికి వెళ్ళే వాళ్ళనింతవరకూ నేనెక్కడా   చూడలేదు. ఇంతకీ ఈ అంత్య క్రియలెవరికి సార్ ?" అని అడిగాడు.. 
పెద్ద మనిషి : " మెదటి శవం నా భార్యది. "
గంగాధర్ : " అయ్యో ఎలా  జరిగింది ?"
పెద్ద మనిషి : ఈ కుక్క మా ఆవిడ  పై అటాక్ చేసి చంపేసింది. "
గంగాధర్ : " అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.. మరి రెండవ శవం సార్ ?"
పెద్ద మనిషి : " అది మా అత్తగారిది. ఆమె మా అవిడని కాపాడటానికి ట్రై చేసింది. అప్పుడు  రెచ్చిపొఇన కుక్క ఆమెని కూడా పొట్టన పెట్టుకుంది అంటూ విలపిస్తూ చెప్పాడా పెద్ద మనిషి "
అది విన్న గంగాధర్ కొద్దిగా ఆలోచించి.....
గంగాధర్ : మీ కుక్కని నాకు కొన్ని రోజులు ఇవ్వగలరా? ఎంత కావాలంటే అంత ఇస్తాను..
పెద్ద మనిషి : "వెళ్ళి ఆ 200మంది వెనుక క్యూలో నిల్చోండి.. "
😜😝😭😪😂😥

No comments:

Post a Comment