బామ్మ ROCKSSSSS డ్రైవర్ బాబు SHOCKZZZZZ

🚌🚌🚌 హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ వైజాగ్ వెళ్లే బస్సు ఎక్కింది, ఎక్కగానే డ్రైవర్ తో... బాబు నేను నిద్రపోతానేమో, విజయవాడ రాగానే నన్ను లేపుతావా అన్నది...?
డ్రైవర్: ఓకే పడుకోండి
ఆ ముసలావిడకు నమ్మకం లేక పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు కూడా చెప్పింది, అందరూ సరే అన్నారు
చాలా దూరం ప్రయాణం  తరువాత ముసలావిడ నిద్ర లేచింది, విజయవాడ ఇంకా రాలేదా బాబు?
అయ్యో సారీ బామ్మగారు మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100కి.మీలు వచ్చేశాము.. ఆమె ఏడవడం మొదలుపెట్టింది, మర్యాదగా వెనక్కి తిప్పి విజయవాడ తీసుకెళ్లమని గోల చేసింది, ఆమెకు తోటి ప్రయాణికులు కూడా ఆమెకు  సపోర్ట్ చేశారు, డ్రైవర్ వెనక్కి తిప్పి విజయవాడ తీసుకొచచి ఆమెను దింపడానికి ట్రై చేశాడు.
డ్రైవర్.. బామ్మగారు విజయవాడ వచ్చేసింది దిగండి...
ఆమె తన బ్యాగు నుండి రెండు ట్యాబ్లెట్స్ తీసి ఇలా అన్నది
నాకు బీపీ ఉంది బిడ్డ.. విజయవాడ రాగానే ట్యాబ్లెట్స్ వేసుకోమని బస్సు ఎక్కేటప్పుడు మా అబ్బాయి చెప్పాడు...
నేను కూడా వైజాగ్ వెళ్లాలి, ఇప్పుడు పోనీయ్యి బాబు వైజాగ్....
బామ్మ ROCKSSSSS
డ్రైవర్ బాబు SHOCKZZZZZ

No comments:

Post a Comment