*కాసేపు నవ్వుకోండెహే..😊*
భార్య:
నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.
భర్త:
నాది నీకంటే ఇంకా గొప్పతనం...! నిన్ను చూసినతర్వాత కూడా పెళ్లి చేసుకున్నాను !!
😄😁😄😃
భార్య :
ఏమిటి ఫోన్ లో ఎవరితో చాలా లోగొంతుకతో మాట్లాడుతున్నారు ?
భర్త :
చెల్లెలితో మాట్లాడుతున్నా.
భార్య :
చెల్లెలితో అయితే మెల్లగా ఎందుకు మాట్లాడటం ?
భర్త : నేను మాట్లాడేది *నీ చెల్లెలితో*.
😁😆😁😆😁
భార్య :
ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా. మీతలమీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదేఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా.
భర్త :
జుట్టు రాలిపోతోందని ఇన్నాళ్లూ అనవసరంగా బాధపడ్డాను. ఈసంగతి ముందే తెలిసుంటే జుట్టు రాలిపోవటం గురించి అసలు పట్టించుకుని ఉండేవాణ్ణికాదు.
😁😄😁😄😁
భార్య :
ప్రపంచం మొత్తంలో ఎంతవెతికినా నాలాంటిభార్య మీకు దొరకనేదొరకదు.
భర్త :
పిచ్చిదానా... ఒకవేళ నేను వెతకవలసివస్తే మళ్ళీకోరికోరి నీలాంటిదానికోసమే ఎందుకు వెతుకుతాను ? మరీ టూమచ్ గా మాట్లాడకు.
🙂😄😋🙂😁
టాక్సీ డ్రైవర్ :
సార్..... బ్రేకులుపని చేయటంలేదు. ఏం చేయమంటారు ?
పాసింజర్ :
ముందు మీటర్ ఆపేయ్ రా... దరిద్రుడా !
😄😁😆😁😄
భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.
షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?
కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని *పెళ్ళాం కాక* కన్నతల్లి పంపిస్తుందా ?
😁😆😆😆😁
*ప్రతిభకూ, దేవుడు ప్రసాదించిన వరానికీ మధ్య వ్యత్యాసం* :-
ఎవడైనా ఒకవిషయంమీద అనర్గళంగా మాట్లాడగలిగితే దాన్ని...
*ప్రతిభ* అంటారు.
కానీ...
అసలు విషయమేలేకుండా గుక్కతిప్పుకోకుండా ఏ ఆడదైనా మాట్లాడుతూంటే....
అది *దేవుడిచ్చిన వరం* అవుతుంది.
😁🙃😁🙃😁
టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...
*"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"*
గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..
*అబ్బే లేదు, బాంబు సీతాకోకచిలక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నా చెవి దగ్గర గుసగుసలాడుతూ అన్నాది.. తుస్ అని* !!!
⚡💥🔥😆😁😆
రామారావు ఆత్మహత్య చేసుకోవడానికని విషం కొనుక్కోటానికి మెడికల్ షాప్ కి వెళ్ళాడు.
షాపువాడు :
నువ్వు ప్రిస్క్రిప్షన్ తెచ్చావా ?
రామారావు తన జేబులో నుండి పెళ్లి సర్టిఫికేట్ బయటకుతీసి చూపించాడు.
షాపువాడు : అర్ధమయ్యింది బ్రదర్! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్ని బాటిల్స్ కావాలి ? ఒకటా..రెండా...?
😜😜😜😜😜😜😜😜😜😜😜